Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

Updated on: May 07, 2026 | 9:51 AM

ప్రేమి విశ్వనాథ్ తెలుగు టెలివిజన్ రంగంలో 'వంటలక్క'గా, 'దీప'గా సుపరిచితులు. ఆమె మలయాళం, తెలుగు సీరియల్స్‌లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తన నటనా ప్రయాణాన్ని మలయాళ సీరియల్ 'కరుతముత్తు'తో ప్రారంభించారు. అందులో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. : 'కార్తీక దీపం' సీరియల్‌లో 'దీప' పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ పాత్ర ద్వారా ఆమె ఎంత పాపులర్ అయ్యారంటే, ఆమె అసలు పేరు కంటే 'వంటలక్క' అనే పేరుతోనే ప్రతి ఇంటికి దగ్గరయ్యారు.

1 / 5
తెలుగు బుల్లితెర చరిత్రలో 'కార్తీక దీపం' సీరియల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇందులో 'దీప'గా, అందరి నోట 'వంటలక్క'గా పేరుతో పాపులర్ అయ్యింది ప్రేమి విశ్వనాథ్. తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, ఆమె తన కెరీర్‌ను ఆర్థికంగా కూడా ఎంతో పటిష్టంగా నిర్మించుకున్నారు. కార్తీక దీపం తర్వాత ఆమె ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక న్యూస్ వైరలవుతుంటుంది.

2 / 5
నివేదికల ప్రకారం ప్రేమి విశ్వనాథ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 40 నుండి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె, నేడు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఆమె కేవలం సీరియల్స్ ద్వారానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. కేరళలో ఆమెకు స్వంతంగా ఒక నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా ఆమె వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. అలాగే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ ప్రేమి విశ్వనాథ్ సక్సెస్ అయినట్లు టాక్.

3 / 5
ఏడేళ్ల క్రితం ఒక సాధారణ నటిగా తెలుగు వారికి పరిచయమైన ప్రేమి విశ్వనాథ్, తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. తెలుగులో కార్తీక దీపం సీరియల్ ద్వారా స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె పాత్ర ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత చాలా కాలం పాటు తెలుగు స్మాల్ స్క్రీన్ కు దూరంగా ఉండిపోయింది. కానీ ఆమె సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని వెండితెరపై సందడి చేసింది.

4 / 5
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ సీరియల్ కు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ సైతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సీరియల్లో ఆమె నటించినందుకు రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఆమె స్మాల్ స్క్రీన్ పై అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. అలాగే అత్యధిక ఆస్తులు ఉన్న నటిగా తనదైన ముద్ర వేసింది.

5 / 5
ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, కేరళలో లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు టాక్. ప్రేమి విశ్వనాథ్ కుటుంబం విషయానికి వస్తే.. ఆమె భర్త పేరు వినీత్ భట్. వీరికి మనుజీత్ అనే బాబు ఉన్నాడు. మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోషూట్స్, తన కొడుకుతో కలిసి రీల్స్ షేర్ చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ మాట్లాడుతూ తను కేరళలో ఉన్నప్పుడు.. తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవాడని.. తెలిపింది.

Follow Us