
బుల్లితెర ముద్దుగుమ్మ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ షో తర్వా ఈ ముద్దుగుమ్మకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.

ముఖ్యంగా ఈ చిన్నది ఇమ్యానయేల్‌తో స్కిట్స్ చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని రోజులు వీరు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. వీటికి తోడు వీరు లవ్ ట్రాక్ సృష్టించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.

జబర్దస్తే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా ఈ బ్యూటీ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తన కామెడీతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

బ్లూ కలర్ డ్రెస్ ధరించి, తన అందంతో గత్తర లేపుతోంది. స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, వర్షా అందాల సెగలు తట్టుకోవడం కష్టమే అంటున్నారు.