Devara: దేవర డేట్ మీద ఫోకస్ చేస్తున్న ఇంటర్నేషనల్ మూవీ

|

Sep 02, 2024 | 9:28 PM

మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలు మనకు పోటీ కాదు. వాటికి ఇండియాలో క్రేజ్ ఉన్నా.. మన సినిమాలను డిస్టర్బ్ చేసేంత స్టామినా అయితే ఉండదు. కానీ కొన్నిసార్లు అలాంటి డేంజర్ కూడా ఉంటుంది. ఈ డేంజర్ కరెక్ట్‌గా ఇప్పుడు దేవర, గేమ్ ఛేంజర్‌కే వచ్చింది. మరి వాటికి వచ్చిన ప్రమాదమేంటి..? వాటిని కంగారు పెడుతున్న ఆ హాలీవుడ్ సినిమాలేంటి..? అప్పుడప్పుడూ మన దగ్గర హాలీవుడ్ సినిమాలు మాయ చేస్తుంటాయి.

1 / 5
మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలు మనకు పోటీ కాదు. వాటికి ఇండియాలో క్రేజ్ ఉన్నా.. మన సినిమాలను డిస్టర్బ్ చేసేంత స్టామినా అయితే ఉండదు. కానీ కొన్నిసార్లు అలాంటి డేంజర్ కూడా ఉంటుంది. ఈ డేంజర్ కరెక్ట్‌గా ఇప్పుడు దేవర, గేమ్ ఛేంజర్‌కే వచ్చింది. మరి వాటికి వచ్చిన ప్రమాదమేంటి..? వాటిని కంగారు పెడుతున్న ఆ హాలీవుడ్ సినిమాలేంటి..?

2 / 5
అప్పుడప్పుడూ మన దగ్గర హాలీవుడ్ సినిమాలు మాయ చేస్తుంటాయి. ఇండియాలోనూ అద్భుతాలు చేస్తుంటాయి. అలాంటి సినిమాలతో మనోళ్లకు కూడా ప్రమాదమే. దేవర విషయంలో ఇదే జరిగేలా ఉందిప్పుడు. సెప్టెంబర్ 27న తారక్ వస్తున్నారు.. దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దీనికో హాలీవుడ్ సినిమా నుంచి ప్రమాదం పొంచి ఉంది.

3 / 5
దేవర ముంగిట నువ్వెంత అనుకోవచ్చు కానీ.. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక. అక్టోబర్ 4న హాలీవుడ్ క్రేజీ సినిమా జోకర్ 2 విడుదల కానుంది. దీనికి ఇండియాలోనూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా 2019లో విడుదలైన జోకర్ ఫస్ట్ పార్ట్ ఇండియాలో దాదాపు 80 కోట్లు వసూలు చేసింది. దేవరను నిలువరిస్తుందని కచ్చితంగా చెప్పలేం కానీ తక్కువంచనా వేయడానికి లేదు.

4 / 5
దేవర మాదిరే.. గేమ్ ఛేంజర్‌కు కూడా ఓ ప్రమాదం పొంచి ఉంది. క్రిస్మస్‌కు రామ్ చరణ్ సినిమా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 20 నుంచి 25 మధ్యలో గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశముంది. త్వరలోనే డేట్ కన్ఫర్మ్ కానుంది. కానీ ఇదే టైమ్‌లో మరో క్రేజీ హాలీవుడ్ సినిమా రానుంది. పైగా దానికి మహేష్ సాయం కూడా ఉంది.

5 / 5
రామ్ చరణ్, శంకర్ టీంను కంగారు పెడుతున్న ఆ సినిమా మరేంటో కాదు.. ముఫాసా ది లయన్ కింగ్. ఐదేళ్ళ కింద వచ్చిన లయన్ కింగ్ ఇండియాలోనే 200 కోట్లు వసూలు చేసింది. దీని ప్రీక్వెల్‌కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారిప్పుడు. దాంతో ప్రాపర్ తెలుగు సినిమాలా డిసెంబర్ 20న రానుంది ముఫాసా. మొత్తానికి అటు దేవర.. ఇటు గేమ్ ఛేంజర్‌కు హాలీవుడ్ టెన్షన్ తప్పట్లేదు.