
క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫేమస్ నటి.

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఆ అమ్మడు ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ప్రేమలో పడిపోతారు గురూ.. తన క్యూట్ నెస్ తో ఎంతో మంది కుర్రాళ్లను బుట్టలో పడేసింది.

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. అంతుకు ముందు రాజా రాణి డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన క్యూట్ ఫొటోలతో ఆట్టుకుంటుంది.