
సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న దళపతి విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. నటుడిగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఇప్పుడు సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు విజయ్. ఈ క్రమంలో విజయ్‌కు సంబంధించిన ఓ పాత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫొటోలో విజయ్‌తో పాటు కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. నటి షీలా. ఈ ముద్దుగుమ్మ గతంలో చిన్నతనంలో విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో మరోసారి ఆమె పేరు చర్చలోకి వచ్చింది. చిన్ననాటి ఫొటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న షీలాను చూసిన అభిమానులు.. ‘ఈమెనే కదా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు.

షీలా తెలుగు చిత్ర పరిశ్రమలో 2006లో అడుగుపెట్టింది. నవదీప్ హీరోగా తెరకెక్కిన సీతాకోక చిలుక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మంచు మనోజ్‌తో రాజుభాయ్, సాయిరామ్ శంకర్‌తో హలో ప్రేమిస్తారా వంటి సినిమాల్లో నటించింది. అయితే షీలా కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో అల్లు అర్జున్ నటించిన పరుగు ఒకటి. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంది.

పరుగు తర్వాత రామ్ హీరోగా నటించిన మస్కాలో షీలా కనిపించింది. తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణతో పరమ వీర చక్ర సినిమాలో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ షీలా సినిమాలు చేసింది. కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్ ప్రధానమైన పాత్రల్లో కనిపించిన ఆమె.. దక్షిణాది ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌లో పలు భాషల్లో సినిమాలు చేసిన షీలా.. ఆ తర్వాత క్రమంగా సినీ పరిశ్రమకు దూరమైంది.

2018లో వచ్చిన కన్నడ చిత్రం హైపర్ ఆమె చివరి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వెండితెరపై పెద్దగా కనిపించలేదు. 2020లో సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.,