
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ ఒకటి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా 2009లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రవితేజ తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇలియానా హీరోయిన్గా నటించగా.. తమిళ నటుడు శ్యామ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతోనే ఆయనకు ‘కిక్ శ్యామ్’ అనే గుర్తింపు వచ్చింది.

ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలోని ప్రతి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఇందులో ఇలియానా చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? సినిమాలో కొద్దిసేపే కనిపించినప్పటికీ తన అందం, నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఆమె పేరు ఆషీకా బతిజా. ‘కిక్’ సినిమాలో రవితేజను ఇష్టపడే అమ్మాయిగా కనిపించి అలరించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు. నటిగా కొనసాగేందుకు అవకాశాలు రాకపోవడంతో చదువుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

అయితే అప్పట్లో క్యూట్‌గా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తోంది? అంటూ నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆషీకా వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. అంతేకాదు.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పటి క్యూట్ లుక్కు భిన్నంగా ఇప్పుడు మరింత స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ‘కిక్’ సినిమాలో చిన్న పాత్రతో అలరించిన ఆషీకా బతిజా ఇప్పుడు ఇలా మారిపోయిందంటూ చర్చించుకుంటున్నారు.