
డింపుల్ హయాతి.. ఈ గ్లామర్ బ్యూటీ తన వయ్యారంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ చేసింది.

అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. హాట్ బ్యూటీ డింపుల్ హయాతి 2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆతర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. అయినా కూడా గుర్తింపు రాలేదు.

అదే సమయంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర ‘ పాటలో నటించింది. ఈ పాటలో హాట్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంది. ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో మరోసారి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. చివరిగా రామబాణం అనే సినిమాలో కనిపించింది.

కానీ ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. రవితేజ సరసన ఈ చిన్నది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తుంది డింపుల్.

బోగి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో డింపుల్ హీరోయిన్ గా ఎంపికైంది. మొన్నామధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా పై డింపుల్ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.