
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటన అందంతో బాలీవుడ్‌నే షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ కల్కీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఈ బ్యూటీ పాన్ ఇండియా లెవల్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక కల్కీ సినిమా సమయంలోనే ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అవి నిజమయ్యాయి, కొన్ని రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాపను చూసుకుంటూ ఏంజాయ్ చేస్తుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపికా పదుకొనే తాజాగా ఫ్యాషన్ ఐకానిక్‌గా మారుతోంది. సరికొత్త డిజైన్స్‌తో తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. తల్లైనా తగ్గేదే లేదంటూ, వన్నె తగ్గని అందంతో కుర్రకారును మాయ చేస్తుంది.

రీసెంట్‌గా ఈ బ్యూటీ, గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చూడటానికి చాలా సింపుల్‌గా చాలా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి చూసిన నెటిజన్స్ ఎండాకాలంలో ఎడారిలో ఏంటీ నీ అల్లరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్యూటిఫుల్ అంటూ తమ అభిప్రయాలను పంచుకుంటున్నారు.