తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ భావన. మహాత్మ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.
శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భావన.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత తెలుగులో ఒకట్రెండ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఈ హీరోయిన్ కిడ్నాప్ కు గురైంది. ఓ స్టార్ హీరో ఆమెను దుండగులతో కిడ్నాప్ చేయించి లైంగిక దాడికి పాల్పడినట్లుగా అప్పట్లో వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.
ఆ ఘటన తర్వాత భావన సినిమాలకు దూరమయ్యింది. ఆ తర్వాత 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకున్న భావన.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.
ఆ ఘటన తర్వాత భావన సినిమాలకు దూరమయ్యింది. ఆ తర్వాత 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకున్న భావన.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.