Nainika Anasuru: హీరోల్లో ఆయనంటే హ్యూజ్ క్రష్.. అతని సినిమాల్లో ఛాన్స్ వస్తే వదులుకోను

Updated on: May 01, 2026 | 1:48 PM

బిగ్‌బాస్ నైనిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను పంచుకున్నారు. నైనిక హైదరాబాద్‌కు మారిన తర్వాత, ఆమె తల్లి కూడా నైనికతోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టు నైనికా తెలిపింది.

1 / 5
బిగ్‌బాస్ ఫేమ్ నైనిక ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణం గురించి కీలక విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ సెలూన్ ఏర్పాటు, సినీ పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, భవిష్యత్ ఆకాంక్షలు ఈ చర్చలో ప్రధానాంశాలుగా నిలిచాయి. నైనిక హైదరాబాద్‌లో ఒక సెలూన్‌ను ప్రారంభించడం వెనుక తన తల్లి ప్రేరణ ఉందని తెలిపింది. తాను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినప్పుడు తన తల్లి కూడా తనతో ఉండాలని అనుకున్నారని, ఆర్థికంగా నిలబడటం కోసం తన తల్లికి కూడా ఒక పని అవసరమని భావించి ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారని నైనిక తెలిపారు. ఒక ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయగా, అనుకోకుండా తాను హైదరాబాద్‌కు మారిన సమయంలోనే అది ఆమోదం పొందిందని వివరించారు.

2 / 5
ఈ సెలూన్ ఏర్పాటుకు సుమారు 70-80 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారని, ఈ మొత్తం కోసం తన తల్లి ఒడిశాలో ఉన్న ఇంటిని అమ్మి సహాయం చేశారని ఆమె పేర్కొన్నారు. ఇది తమకు చాలా పెద్ద విషయం అని, హైదరాబాద్‌లో లగ్జరీ సెలూన్ తెరవడం సవాలుతో కూడుకున్నదని నైనిక అన్నారు. ప్రస్తుత వ్యాపారంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, హైదరాబాద్‌ తనకు మంచి మద్దతు ఇస్తుందని, భవిష్యత్తులో 3 BHK ఫ్లాట్ కొనుగోలు చేయాలని తెలిపింది.  నైనిక సినీ రంగంలో అవకాశాల గురించి మాట్లాడుతూ, క్లీన్ ప్రాజెక్టులు తనకు రాలేదని వెల్లడించారు.

3 / 5
కొన్ని నిర్మాణ సంస్థలు నేరుగా కాకపోయినా, కాస్టింగ్ చూసుకునే వ్యక్తుల ద్వారా "కాంప్రమైజ్" కావడానికి సిద్ధమా అనే ఆప్షన్‌ను వాట్స్ అప్ సందేశాల ద్వారా పంపేవారని తెలిపారు. రెడీ టు కాంప్రమైజ్, ఎస్ ఆర్ నో వంటి ప్రశ్నలు చాలా సాధారణం అయిపోయాయని, ఇది తమకు షాకింగ్‌గా అనిపించినా, వాటిని విస్మరించి "క్లీన్ ప్రాజెక్టులు" కోసం ఎదురు చూస్తున్నానని నైనిక స్పష్టం చేశారు. సినిమాను సీరియస్‌గా తీసుకునే నిజమైన, ప్రొఫెషనల్ నిర్మాణ సంస్థలు మాత్రమే "క్లీన్" ప్రాజెక్టులను అందిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

4 / 5
పెద్ద స్క్రీన్ కోసం తాను ఇంకా పూర్తిగా సిద్ధంగా లేనని, తన నటనను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నానని నైనిక తెలిపారు. ప్రజలు తనని పెద్ద స్క్రీన్ కోసం పుట్టారని చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. తనకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉందని అడగగా, నైనిక సాయి పల్లవి ఫిదా సినిమాలో పోషించిన పాత్ర వంటివి చేయాలని అన్నారు. అది సాంప్రదాయబద్ధంగా ఉంటూనే, ధైర్యంగా మాట్లాడే, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే ఒక తెలుగు అమ్మాయి పాత్ర అని వివరించారు.

5 / 5
అలాంటి "టిపికల్ తెలుగు అమ్మాయి" పాత్రలలో నటించాలని ఆమె ఆకాంక్షించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారికి తాను అప్లికేషన్ పంపాలనుకుంటున్నానని, ఫిదా 2 లో నటించాలని కోరుకుంటున్నానని నవ్వుతూ చెప్పారు. తన డ్రీమ్ హీరోల గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్‌పై తనకు హ్యూజ్ క్రష్ ఉందని, ఆనంద్ దేవరకొండ తన రెండో క్రష్ అని నైనిక వెల్లడించారు. ఒకవేళ సిస్టర్ పాత్రలు వస్తే, పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పకుండా చేస్తానని, లేదంటే స్వీకరించనని స్పష్టం చేశారు.

Follow Us