
సోషల్ మీడియాలో బిజీగా ఉండే సెలబ్రిటీల్లో బిగ్ బాస్ బ్యూటీ దివి ఒకరు. బుల్లితెర రియాలిటీ షోతో బాగా పాపులరైన ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను నిత్యం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటుంది.

తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది దివి. ఇందులో సముద్రతీరాన రొమాంటిక్ పోజులతో రెచ్చిపోయింది బిగ్ బాస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాగర కన్యగా మారిపోయిన దివి ఫొటోలు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. ఆమె ఫొటోలను చూసిన ఫ్యాన్స్ 'ఏంటి దివి.. ఇంత గ్లామర్‌గా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ 'గాడ్ ఫాదర్'లో ఒక కీలక పాత్రలో మెరిసింది దివి. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏటీఎం వెబ్ సిరీస్‌లోనూ ఓ కీ రోల్ పోషించింది.

ప్రస్తుతం కొన్ని బుల్లితెర షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది దివి. అయితే ఎప్పటికప్పుడు నెట్టింట్లో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటోందీ అందాల తార.