
అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టిది పేరు ఈ చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది.

టాలీవుడ్ నటి అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో తెలుగు వెండితెర పైకి అడుగు పెట్టింది. ఈ మూవీలో మహేష్ బాబు స్నేహితురాలిగా నటించి, తన నటనతో ఆకట్టుకుంది. కనిపించింది చిన్న పాత్రలో అయినా అందరినీ తన వైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ.

ఇక తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌస్‌లో తన ఆటతీరు, అంద చందాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మ డుకు అవకాశాలు తలుపు తట్టినవి, గాడ్ ఫాదర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ.. చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ, దివి ఎదురు చూపులు ఎవరి కోసమో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.