
అందాల భామ భాగ్య శ్రీ బోర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ చిన్నది తెలుగులో మిస్టర్ బచ్చన్ మూవీతో డెబ్యూ ఇచ్చి, ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. తన నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

మొదటి సినిమాతో మంచి హిట్ అందుకోలేకపోయినప్పటికీ, మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. రీసెంట్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ కూడా ఈ అమ్మడుకు హిట్ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఈ చిన్నది విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ సినిమా చేస్తుంది. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్, రానాతో కూడా కలిసి నటిస్తుంది. తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, నిత్యం తన హాట్ అంటూ క్యూట్ ఫొటోస్‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ లంగావోణీలో అందంగా మెరిసిపోయింది. గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అంటూ.. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.