
మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అనన్య నాగళ్ల. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అందంతో పాటు చక్కటి నటనను కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనన్య.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది అనన్య నాగళ్ల. ఈ సినిమా తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ చిన్నది నటించిన రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో పొట్టేలు సినిమా ఒకటి.. మరొకటి తంత్ర.

మొన్నటివరకు గ్లామర్ షోకు నో చెప్తూ వచ్చిన అనన్య ఇప్పుడు అందాలకు హద్దులు చెరిపేస్తోంది. ఇటీవల విడుదలైన పోట్టెలు, తంత్ర సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. అలాగే లీక్ లాక్ సీన్స్ లోనూ కనిపించింది

సినిమాకు అవసరమైతే అందాలతో ఆకట్టుకుంటాయి అంటుంది అనన్య. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది అనన్య. క్యూట్ స్మైల్ తో కవ్వించింది ఈ భామ.