
హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు విజయ్.

ఇక స్నేహ, ప్రసన్నల కుమార్తె, కుమారుడితోనూ చాలా సరదాగా మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా స్నేహ కూతురు విజయ్ అభిమాని కావడంతో విజయ్ ని ప్రేమగా హత్తుకుంది. ప్రస్తుతం వీరి మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా స్నేహ పిల్లలతో విజయ్ దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా విజయ్-స్నేహ కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. 2003లో వచ్చిన ' వసీగర' అలాగే 2024లో వచ్చిన ' ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాలలో జోడీగా నటించారు విజయ్- స్నేహ. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

సీఎం విజయ్ తో కలిసున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది స్నేహ. 'విజయ్ సర్‌తో రెండు సినిమాల్లో పనిచేసిన నేను, ఈ రోజు ఆయన్ని సీఎం జోసెఫ్ విజయ్ పాత్రలో చూడటం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ అద్భత క్షణాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది స్నేహ.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తమిళ సినిమా ఇండస్ట్రీ అభివృద్దికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విజయ్. ఇందులో భాగంగానే కోలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు సీఎంను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు