
టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో ఈ అమ్మడు కనిపించకుండాపోయింది.

అర్జున్ రెడ్డి సినిమాలో అమాయకపు అమ్మాయిగా నటించి మెప్పించిన షాలిని పాండే. తన నటనతో అందంతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. షాలిని పాండేకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా చేయకపోయినా.. చిన్న చిన్న పాత్రలు చేస్తుంది షాలిని పాండే. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది షాలిని. తన గ్లామర్ తో గాలులు వేస్తోంది.

అందాలు ఆరబోస్తున్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం భయంకరంగా పెంచుకుంది. రీసెంట్ డేస్ లో ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ అమ్మడి అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.