
సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

జయం సినిమా మంచి విజయం సాధించడంతో సదాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ.

తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది సదా. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది .

కన్నడ హిందీ బాషల్లోనూ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పలు టీవీ షోల్లో జడ్జ్ గా చేస్తోంది సదా.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది సదా. వయసు పెరుగుతున్నా తరగని గ్లామర్ తో ఆకట్టుకుంటుంది సదా.