
రచితా రామ్ శాండల్‌వుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న నటి. ఈ అందాల భామకు వివిపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. సుమారు 12 సంవత్సరాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రచితా రామ్ తెలుగులో సూపర్ మచ్చి అనే సినిమాలో నటించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

రచితా రామ్ కన్నడలో చాలా పాపులర్ హీరోయిన్. అక్కడ శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, దర్శన్, గణేష్ వంటి దాదాపు అందరు స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ భామ స్టార్ హీరోయిన్. అలాగే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో ఈ అమ్మడు ఒకరు. రచితా రామ్ ఒక్కో సినిమాకు సుమారు 3-4 కోట్లు అందుకుంటుంది ఈ చిన్నది.

ఆమె 2013లో విడుదలైన 'బుల్బుల్' సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. రచితా రామ్ రియాలిటీ షోలలో కూడా కనిపిస్తుంది. ఆమె కొన్ని టీవీ షోల్లోనూ జడ్జ్ గా కూడా పాల్గొంటుంది. రచితా రామ్ సినిమాలు, టీవీ షోలతో చేతినిండా సంపాదిస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండింగ్ కూడా చేస్తుంది దాని ద్వారా కూడా ఈ అమ్మడు బాగానే వెనకేసుకుంటుంది.

మొన్నామధ్య రచితా రామ్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. రచితా రామ్‌కు ఒక విలాసవంతమైన కారు, ఒక బంగ్లా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె మొత్తం ఆస్తుల విషయం చర్చకు వచ్చింది. నటి రచితా రామ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 9 కోట్లు అని తెలుస్తుంది.

కన్నడ ఆడియెన్స్ ఈ బ్యూటీని ముద్దుగా డింపుల్ క్వీన్ అని పిల్చుకుంటారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నకన్నడ హీరోయిన్ కూడా రచితానే. ప్రస్తుతం ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. రచితకు నిత్యా రామ్ అనే సిస్టర్ కూడా ఉంది. ఆమె కన్నడ సీరియల్స్ చేస్తోంది.