చిరంజీవి కంటే హిట్స్ నాకే ఎక్కువ.. కానీ ఆ తప్పు వల్లే ఇలా

Updated on: May 12, 2026 | 12:50 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మెగాస్టార్’ అనే పదానికి నిలువెత్తు రూపం చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, స్వయంకృషితో శిఖరాగ్రానికి చేరుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. అయితే, ఆయన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి సీనియర్ నటుడు శివకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1 / 5
శివకృష్ణ మాట్లాడుతూ, "మేమిద్దరం ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చాం. నిజం చెప్పాలంటే, ఆరంభంలో చిరంజీవి కంటే నాకే వరుస హిట్లు వచ్చాయి. 'ఎర్ర మల్లెలు' సినిమాతో నేను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాను. అప్పట్లో చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని గుర్తు చేసుకున్నారు.

2 / 5
అయితే, తర్వాతి కాలంలో చిరంజీవి అగ్రస్థాయికి వెళ్లడానికి ఆయన ప్లానింగ్ మరియు అంకితభావమే కారణమని శివకృష్ణ విశ్లేషించారు. తాను కొన్ని మంచి అవకాశాలను సున్నితంగా తిరస్కరించానని అది నా వ్యక్తిత్వం కావచ్చు కానీ కెరీర్ పరంగా చేసిన అతిపెద్ద తప్పు అదేనని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు

3 / 5
 కానీ చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక మెట్టుగా మార్చుకున్నారని ఆయన నిజాయితీగా చెప్పారు. ముఖ్యంగా 'ఖైదీ' సినిమాతో చిరు సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్ చరిత్రనే మార్చేసింది. పరిశ్రమలో ఎవరితో ఎలా ఉండాలి, కెరీర్‌ను ఎలా మలచుకోవాలి అనే విషయంలో చిరు పక్కాగా ఉండేవారని, అదే తనను వెనకబడేలా చేసిందని శివకృష్ణ అంగీకరించారు.

4 / 5
తను చేసిన పొరపాట్లే చిరంజీవిని నంబర్ వన్ చేశాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారి డ్యాన్సులు, ఫైట్స్ గురించి శివకృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఆ కాలంలో ఫైట్స్ అంటే కేవలం కొట్టుకోవడం మాత్రమే ఉండేది. కానీ అందులో ఒక గ్రేస్, ఒక స్టైల్ తీసుకొచ్చింది చిరంజీవి గారే. అలాగే డ్యాన్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఒకానొక దశలో మాలాంటి వాళ్లకి కూడా ఆయన వేగం అందుకోవడం కష్టమయ్యేది" అని నవ్వుతూ చెప్పారు.

5 / 5
ఇక వ్యక్తిత్వ విషయానికి వస్తే, చిరంజీవి ఎప్పుడూ తోటి నటులను ప్రోత్సహించేవారని శివకృష్ణ తెలిపారు. ఎవరైనా బాగా నటిస్తే వెంటనే దగ్గరకు వచ్చి అభినందించడం ఆయన గొప్ప గుణమని అన్నారు. చిరంజీవికి ఉన్న ఆ తపన, కసి వల్లే ఆయన 'సుప్రీం హీరో' నుంచి 'మెగాస్టార్' వరకు ఎదిగారని శివకృష్ణ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే సూత్రాన్ని చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.

Follow Us