
చిన్న గుడ్ల కూరకు కావాల్సిన పదార్ధాలు : కోడి మాంసం చిన్న గుడ్లు, మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా,ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి : ముందుగా ఈ కోడి మాంసం చిన్న గుడ్లను తీసుకుని బాగా కడిగి వాటిని ఉడికించి, చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి, దానిలో నూనె వేసి చిన్న గుడ్లను కూడా వేసి వేయించుకోవాలి. రంగు మారే వరకు కిందకు దించకండి.

మసాలాలను సిద్ధం చేసుకోవాలి : ఒక పాన్ పెట్టి దానిలో ధనియాలు, లవంగాలు , దాచిన చెక్క బాగా వేయించి మిక్సీలో పొడి లాగా పెట్టుకోవాలి ఆ తర్వాత పాన్ లో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి మారే మారే వరకు స్టవ్ మీదే వేయించుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఇది బాగా వేగిన తరవాత ఈ మిశ్రమంలో దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో మూడు టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యేవరకు పొయ్యి మీదే ఉడికించాలి. ఇలా చేస్తే చిక్కటి గ్రేవీ వస్తుంది తినడానికి కూడా అదిరిపోతోంది.

చివర్లో ఉల్లిపాయలు, టమోటాలు కూడా దీనిలో వేసి కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుడ్లను వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి . ఇక చివర్లో మసాలా పొడి ఇంకా కొత్తిమీరను కూడా వేసి కిందకు దించుకోవాలి.