2 / 5
ఇక పెరుగు మన ఒంటికి చలువ చేస్తుంది. దీన్ని తింటే శరీరంలో మ్యూకస్ పెరుగుతుంది. అయితే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్యల బారిన పడేవారు రాత్రి పూట.. అందులోనూ చలికాలంలో రాత్రి పూట పెరుగును తింటే మ్యూకస్ ఇంకా ఎక్కువై సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వీరు ఈ సీజన్‌లో రాత్రిపూట పెరుగును తినకపోవడమే మంచిది.