Mobile Phones: మొబైల్ ఫోన్లు వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? ఇదిగో క్లారిటీ

|

Sep 07, 2024 | 12:46 PM

రేడియో తరంగాల ఎక్స్‌పోజర్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కానీ మొబైల్ ఫోన్‌లకు మెదడు క్యాన్సర్‌తో సంబంధం లేదు. ఇది ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించబడింది.

1 / 9
మొబైల్ ఫోన్లను వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా.? ఇప్పుడు ఈ ప్రశ్నకు డబ్ల్యూహెచ్ఓ సమాధానం ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన తాజా అధ్యయనంలో మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల మెదడు క్యాన్సర్ ప్రమాదం ఏం లేదని.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.

2 / 9
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనలను విశ్లేషించిన ఈ అధ్యయనం, మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడంపై పలు కీలక విషయాలను వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వినియోగంతో మెదడు లేదా తలకు సంబంధించిన ఎలాంటి క్యాన్సర్‌కు సంబంధం లేదని.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు డబ్ల్యూహెచ్ఓ కనుగొనలేదు.

3 / 9
రేడియో తరంగాల ఎక్స్‌పోజర్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కానీ మొబైల్ ఫోన్‌లకు మెదడు క్యాన్సర్‌తో సంబంధం లేదు. ఇది ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించబడింది.

రేడియో తరంగాల ఎక్స్‌పోజర్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కానీ మొబైల్ ఫోన్‌లకు మెదడు క్యాన్సర్‌తో సంబంధం లేదు. ఇది ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించబడింది.

4 / 9
మొబైల్ ఫోన్లు తరచుగా ఉపయోగించేటప్పుడు తలకు దగ్గరగా ఉంటాయి. అలాగే ఈ మొబైళ్లు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఈ రెండు కారణాలతోనే మొబైల్ ఫోన్ల నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తుందని కొందరు భయపడుతున్నారు.

5 / 9
మొబైల్ ఫోన్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియో తరంగాలను కంట్రోల్ చేసేందుకు సైన్స్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

6 / 9
మొబైల్ ఫోన్ల రేడియో తరంగాలు, మెదడు క్యాన్సర్ లేదా ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే మొబైల్ ఫోన్‌ల వాడకం ద్వారా ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వృత్తాంత పరిశోధన అధ్యయనాలు చెప్పాయి.

7 / 9
2011లో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) రేడియో వేవ్స్ ఎక్స్‌పోజర్‌ను మానవులకు సాధ్యమయ్యే క్యాన్సర్‌కు కారకాలుగా పేర్కొంది. ఈ IARC ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఓ భాగం.

8 / 9
 రేడియో తరంగాలను క్యాన్సర్ కారకాలుగా ఎన్నో మానవ పరిశీలనా అధ్యయనాలు తెలిపాయి. అయితే మొబైల్ ఫోన్లు లేదా వైర్‌లెస్ టెక్నాలజీల నుంచి వచ్చే రేడియో తరంగాలకు మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

9 / 9
వైర్‌లెస్ టెక్నాలజీల నుంచి వచ్చే రేడియో తరంగాలు మనుషుల ప్రభావంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని.. కానీ క్యాన్సర్ వస్తుందని సూచించే బలమైన సాక్ష్యాలు ఏ అధ్యయనంలోనూ బయటపడలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.