Neem Leaves: ప్రతిరోజూ పరగడుపున వేపాకులు తింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయ్..!

Updated on: May 27, 2025 | 7:44 AM

వేపాకు.. ఆయుర్వేదంలో ఇదో అద్భుత సంజీవని .. సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు. వేప ఆకు ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, యాంటి అల్సర్‌, యాంటి మలేరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌, యాంటి ఆక్సిడెంట్‌, యాంటి మ్యుటాజెనిక్‌, యాంటి కార్సినోజెనిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేపలో విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని గుణాలు కలిగిన వేపాకులు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో వేపాకులు తింటే ఏమవుతుందో తెలుసా.? పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5
పరగడుపున వేపాకులు తినడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. ఆర్ధరైటిస్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వేపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వేపాకులు నమిలి తినడం వల్ల శరీరం మెటబోలిజం మెరుగుపడుతుంది. ఆకలి క్రమబద్ధీకరణ అవుతుంది. బరువు నియంత్రణకు దోహదపడుతుంది.

2 / 5
దోమలను వదిలించుకోవడానికి ఇది సులభమైన మార్గం . మీరు కొన్ని వేప ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. నీటి రంగు మారి ఆకులు మృదువుగా మారినప్పుడు, నీటిని చల్లబరిచిన తర్వాత ఫిల్టర్ చేయండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, కర్టెన్లలు, దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయండి. దోమలు దాని వాసన కారణంగా పారిపోతాయి.

3 / 5
డయాబెటిస్ రోగులకు వేపాకులు చాలా మంచివి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వేపాకులు తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు క్రమంగా దూరమవుతాయి. రోజూ పరగడుపున వేపాకులు తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సంక్రమణ వ్యాధుల ముప్పు తొలగిస్తుంది.

4 / 5
వేప పేస్ట్ తయారు చేసుకుని చర్మానికి అప్లై చేసుకోవటం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోండి. మీకు కావాలంటే, మీరు దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు, మెడపై రాయండి. దీని బలమైన వాసన దోమలు మీ దగ్గరికి రానివ్వదు, ఇది పిల్లలకు కూడా సురక్షితం.

5 / 5
వేపాకుల్లో చేదు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్స్, మలినాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వేపాకులు తినడం వల్ల శరీరంలోపల ఉండే విష పదార్ధాలు శుభ్రమౌతాయి. వేపాకులు తినడం వల్ల కొన్ని రోజుల్లోనే చర్మం నిగారింపు వస్తుంది. పింపుల్స్ సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది.