Credit Card: క్రెడిట్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మీ బిల్లు సమయానికి కడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

|

Jul 28, 2024 | 1:55 PM

ఇటీవల కాలంలో అందరూ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అత్యవసర సమయంలో బయటకు అప్పుల కోసం వెళ్లకుండా ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాక కార్డుతో షాపింగ్ చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి వినియోగదారులు ఆలోచిస్తున్నారు. దానిపై రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు కూడా ఆకర్షిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు ఎంత ప్రయోజనమో.. దాని బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అంత నష్టపోయే ప్రమాదం ఉంది. అధిక వడ్డీతో పాటు ఆలస్య రుసుములు కార్డు సంస్థలు విధించే అవకాశం ఉంది. అందుకే డ్యూ డేట్ కి ముందే పేమెంట్ చేయాల్సి ఉంది. అలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవి మీకు భవిష్యత్తులో బాగా ఉపకరిస్తాయి. క్రెడిట్ బిల్లు సమయానికి చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మెరుగైన క్రెడిట్ స్కోర్.. ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్‌లోని బ్యాలెన్స్‌ను సమయానికి చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ బాగా మెరుగువుతుంది. క్రెడిట్ స్కోర్ బాగుందంటే మీకు అత్యవసర సమయంలో రుణాలు సులభంగా మంజూరవుతాయి. తక్కువ వడ్డీ రేటుకే లోన్లు వస్తాయి. ఇది మీ భవిష్యత్తు అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.

2 / 5
పెనాల్టీ భయం ఉండదు.. సమయానికి చెల్లింపులు చేయడం వల్ల మీరు ఆలస్య రుసుములను చెల్లించాల్సిన అవసరం రాదు. పైగా ఇది అదనపు వడ్డీని కూడా లేకుండా చేస్తుంది. మీ కార్డుపై మొత్తం బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించడం వల్ల కాలక్రమేణా వడ్డీ చెల్లింపుల్లో పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.

3 / 5
మొత్తం చెల్లించాలి.. క్రెడిట్ కార్డులో టోటల్ డ్యూ, మినిమం డ్యూ అని రెండు ఉంటాయి. వీలైనంత వరకూ మొత్తం డ్యూ చెల్లించడానికి ప్రయత్నించాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది. మినిమం డ్యూ చెల్లించినా.. వడ్డీ భారం తగ్గదు. ఇంకా మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతూనే ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ కోసం క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో మొత్తం డ్యూ చెల్లించడం చాలా అవసరం.

4 / 5
అధిక క్రెడిట్ పరిమితి.. మీరు మీ బకాయిలను సకాలంలో చెల్లించి, బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రదర్శిస్తే, మీ బ్యాంక్ మీ క్రెడిట్ పరిమితిని పెంచుతుంది. క్రెడిట్ పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంత మెరుగ్గా ఉంటుంది. తద్వారా మెరుగైన క్రెడిట్ స్కోర్ సాధ్యమవుతుంది.

5 / 5
అదనపు సౌలభ్యం.. మంచి క్రెడిట్ స్కోర్, అంటే 750 కంటే ఎక్కువ ఉంటే, గొప్ప రివార్డ్‌లతో వచ్చే మెరుగైన క్రెడిట్ కార్డ్‌లు, ప్రిఫరెన్షియల్ నిబంధనలతో సులభంగా పొందగలిగే వ్యక్తిగత రుణాలు, పోటీ వడ్డీ రేట్ల వద్ద మీ మార్ట్‌గేజ్ అప్లికేషన్‌ల ప్రాసెసింగ్ కూడా మీకు లభిస్తాయి.