
New Bajaj Pulsar: ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన పాపులర్ పల్సర్ సిరీస్‌లో సరికొత్త మార్పులు చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి 350cc ఇంజిన్ రేంజ్‌తో కొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఇది Pulsar NS400Z అప్‌డేటెడ్ వెర్షన్ కానుంది. ఇప్పటికే ఈ బైకులు షోరూమ్‌లకు చేరుకుంటున్నట్లు సమాచారం.

ఇంజిన్ సామర్థ్యం తగ్గించడానికి అసలు కారణం ఇదే: సాధారణంగా కంపెనీలు ఇంజిన్ పవర్‌ను పెంచుతాయి. కానీ బజాజ్ మాత్రం 373cc నుండి 349.13ccకి తగ్గించింది. దీని వెనుక బలమైన ఆర్థిక కారణం ఉంది. భారత ప్రభుత్వ GST 2.0 నిబంధనల ప్రకారం, 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 40% ట్యాక్స్ పడుతుంది. అదే 350cc లోపు ఉంటే కేవలం 18% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఈ ట్యాక్స్ వ్యత్యాసం వల్ల బైక్ ధర భారీగా తగ్గుతుంది. అందుకే Pulsar NS400Z, Dominar 400 మోడళ్లలో ఈ కొత్త 349.13cc ఇంజిన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు తక్కువ ధరకే అందించాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది.

డిజైన్, లుక్: కొత్త 350cc పల్సర్‌లో డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేవు. పాత మోడల్‌లో ఉన్న లుక్, కలర్ ఆప్షన్లు, ఫీచర్లనే కొనసాగించారు. ఒకే ఒక చిన్న మార్పు ఏంటంటే.. గతంలో ఇంజిన్‌పై '373cc' అని ఉండే మార్కింగ్‌ను ఇప్పుడు తొలగించారు. పర్ఫార్మెన్స్‌లో స్వల్ప మార్పు: ఇంజిన్ సైజు తగ్గడం వల్ల పవర్‌లో కొంచెం మార్పు కనిపిస్తుంది. కొత్త పవర్ 40.6 PS పవర్, 33.2 Nm టార్క్. ఇక పాత పవర్ 43 PS పవర్, 35 Nm టార్క్. అలాగే ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, స్మూత్ రైడింగ్ కోసం ఎలక్ట్రానిక్ థ్రోటిల్ ఉంటాయి.

నెక్స్ట్ లెవల్ ఫీచర్లు: సామర్థ్యం తగ్గినా ఫీచర్లలో మాత్రం బజాజ్ ఎక్కడా రాజీ పడలేదు. సస్పెన్షన్ 43mm USD ఫ్రంట్ ఫోర్క్స్, బ్రేకింగ్ డ్యూయల్ ఛానల్ ABS, పెద్ద డిస్క్ బ్రేక్స్ ఉండనున్నాయి. అలాగే టెక్నాలజీ పరంగా ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం ఉంది.

లైటింగ్: పవర్ ఫుల్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, అలాగే తక్కువ ట్యాక్స్ కేటగిరీలోకి రావడం వల్ల ఈ బైక్ ధర చాలా మంది యువతకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఇది ఒక మంచి 'బడ్జెట్ ఫ్రెండ్లీ' ఆప్షన్ కానుంది.