Breast Cancer: ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?

|

Aug 09, 2024 | 12:54 PM

నేటి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2022 నాటి లెక్కల ప్రకారం 28.2% మంది మహిళా క్యాన్సర్ బాధితులు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సులో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు..

1 / 5
నేటి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2022 నాటి లెక్కల ప్రకారం 28.2% మంది మహిళా క్యాన్సర్ బాధితులు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సులో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

2 / 5
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళలు 25 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధిని నివారించడానికి అతిపెద్ద మార్గం 'సెల్ఫ్ డిటెక్షన్'. రొమ్ములో గడ్డ లేదా కణితి ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే 10-15 శాతం కణితుల్లో క్యాన్సర్‌ భయం ఉంటుంది. కానీ సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ప్రమాదం అరికట్టవచ్చు.

3 / 5
ఇటువంటి తీవ్రమైన అనారోగ్యం శరీరంలో గూడు కట్టుకోవడాన్ని ప్రధాన కారణం జీవనశైలి. రొమ్ము గడ్డలు ఎల్లప్పుడూ చర్మం కింద ఉంటాయి. చనుమొనల చుట్టూ ఇలాంటి మాంసపు ముద్దలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఇలాంటి గడ్డలు ముద్ద నొక్కినప్పుడు గట్టిగా అనిపిస్తే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అది కూడా వీలైనంత త్వరగా.

4 / 5
అలాగే రొమ్ముపై దద్దుర్లు లేదా దురద వంటి ఏవైనా అసౌకర్యం గుర్తించినా నిర్లక్ష్యం చేయవద్దు. రొమ్ము క్యాన్సర్ లక్షణాలలో భుజం, మెడ నొప్పి కూడా ఒకటి. మీకు తరచూ భుజం నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. స్వీయ వైద్యం చేయకపోవడమే మంచిది.

5 / 5
రొమ్ము ఆకారం వక్రీకరించినట్లు అనిపించినా జాగ్రత్తగా ఉండాలి. రొమ్ము పరిమాణంలో ఆకస్మిక మార్పు మంచిది కాదు. లోదుస్తులు ధరించినప్పుడు ఏదైనా రుద్దినట్లు, లాగినట్లు అనుభూతి కలిగినా, పడుకున్నప్పుడు నొప్పి ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముపై ఎలాంటి దద్దుర్లు రాకుండా మరింత జాగ్రత్త తీసుకోవాలి.