
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: సొరకాయలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయాన్నే సొరకాయ రసం తాగడం లేదా వంటకాల్లో తీసుకోవడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.

గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: సొరకాయలో పొటాషియం, సోడియం, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని అరికడుతుంది.

చర్మ సౌందర్యం, మంచి నిద్ర: సొరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి కాంతిని తెస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం వల్ల మొటిమలు తగ్గుతాయి. రాత్రి వేళల్లో సొరకాయను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమై సుఖనిద్ర పడుతుంది.

శరీరాన్ని చల్లబరుస్తుంది: ఎండకాలంలో లేదా శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు సొరకాయను తీసుకోవడం వల్ల శరీరం తక్షణమే సమతుల్యత పొందుతుంది. ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: సొరకాయలో ఉండే ద్రవ పదార్థాలు, పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి. ఇది అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే, సొరకాయ రసం తాగేటప్పుడు అది చేదుగా ఉంటే కచ్చితంగా తాగకూడదు. చేదుగా ఉన్న సొరకాయలో కూకర్బిటాసిన్ అనే విషపూరిత పదార్థం ఉంటుంది, ఇది కడుపునొప్పి లేదా వాంతులకు దారితీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ తాజా, తియ్యటి సొరకాయను మాత్రమే ఎంచుకోవాలి.