
ఎప్పుడు రొటీన్ కూరలు ఏం చేస్తారు ఈ సారి కొంచం కొత్తగా పూరి, చపాతీ, రోటీల్లోకి ఇది ట్రై చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా కూడా అయిపోతోంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కూర చేసుకుని తినొచ్చు దీని కోసం శనగపిండి, ఉల్లిపాయతో ఉంటే చాలు చాలా ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు.

శనగపిండి, ఉల్లిపాయ చట్నీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి , రెండు ఉల్లిపాయలు , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు – ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఇంకా తగినంత నీరును కూడా తీసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి.

శనగపిండి, ఉల్లిపాయ తయారీ విధానం: ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని కొద్దిగా శనగపిండి, ఇంకా నీరు పోస్తూ కొద్దిగా కూడా ఉండలు లేకుండా వీటిని చేసుకోవాలి. ఆ తరవాత పాన్‌లో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక దీనిలో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి.

శనగపిండి, ఉల్లిపాయ తయారీ విధానం: ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా దీనిలో వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు దీనిని వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు దీనిని బాగా కలపాలి. ఇంకా కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దీనిని కలపాలి.

ఇక చివర్లో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా దీనిలో వేయాలి వేసాక కొద్దీ కొద్దిగా కలుపుతూ ఉండాలి. సన్నని మంటపై ఇది బాగా చిక్కబడే వరకు కలుపుతూ బాగా ఉడికించాలి. ఇలా చేస్తే తినడానికి కూడా అదిరిపోతోంది.ఇది కొంచం గట్టిగా అయ్యే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతోంది.