
కావాల్సిన పదార్ధాలు : అర కిలో పచ్చి బొప్పాయి ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమాటోలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర.

ముందుగా పచ్చి బొప్పాయి ముక్కలను సిద్ధం చేసుకోవాలి: పచ్చి బొప్పాయి నీటితో రెండు సార్లు బాగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ముక్కలు పెద్దగా అస్సలు కట్ చేయకండి. ఉడకడానికి చాలా సమయం పడుతుంది.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక పాన్‌లో నూనె వేసి, అది వేడయ్యాక దానిలో జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. కొద్దీ సేపటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారే వరకు పొయ్యి మీదే ఉంచండి.

ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ కారం , రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటోలు ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచాలి.

చివర్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు వేసి బాగా ఉడికే వారికీ స్టవ్ మీదే ఉంచాలి. ఇవి మరి మెత్తగా అయ్యే వరకు ఉంచకూడదు. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి అన్నంలో తినడమే.