పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే..

Updated on: Apr 24, 2025 | 2:56 PM

పల్లీలు, నువ్వుల్లో అధికంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండు పదార్థాల్లోనూ హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-6, ఒమేగా-9) సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పల్లీల్లో ఉండే నాయసిన్, నువ్వుల్లో ఉండే సెసమిన్ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పల్లీలు, నువ్వులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అయితే, నువ్వులు, పల్లీలు కలిపి తింటే ఎలాంటి పోషకాలు అందుతాయి..? ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పల్లీలు, నువ్వులు కలిపి తినటం వల్ల లభించే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చక్కగా ఉంచుతాయి. పిగ్మెంటేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారికి ఉపశమనం లభిస్తుంది. పల్లీలు, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు అందుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

2 / 5
నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్ పల్లీల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడతాయి. పల్లీలు, నువ్వుల్లో విటమిన్ B3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
నువ్వులు, పల్లీల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలకు బలం అందిస్తాయి.

నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్ పల్లీల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడతాయి. పల్లీలు, నువ్వుల్లో విటమిన్ B3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నువ్వులు, పల్లీల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలకు బలం అందిస్తాయి.

3 / 5
పల్లీలు, నువ్వులు కలిపి తక్కువ పరిమాణంలో ప్రతి రోజు తింటే ఆకలిని కంట్రోల్ చేసి పోషకాలను అందిస్తాయి. ఇది కడుపులో సంతృప్తిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తాయి.
నువ్వులు ఎక్కువ తింటే వేడి చేస్తాయి. కానీ ఆరోగ్యానికి మంచివి.

పల్లీలు, నువ్వులు కలిపి తక్కువ పరిమాణంలో ప్రతి రోజు తింటే ఆకలిని కంట్రోల్ చేసి పోషకాలను అందిస్తాయి. ఇది కడుపులో సంతృప్తిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తాయి. నువ్వులు ఎక్కువ తింటే వేడి చేస్తాయి. కానీ ఆరోగ్యానికి మంచివి.

4 / 5
నువ్వులతో మన ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సీ, ఈ అందుతాయి.. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ ఉంటాయి.

నువ్వులతో మన ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సీ, ఈ అందుతాయి.. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ ఉంటాయి.

5 / 5
చాలా మంది నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి లడ్డూలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తినటం వల్ల జీర్ణక్రియను పెంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. బీపీని తగ్గిస్తాయి. రక్తకణాలను రిపేర్ చేస్తాయి. ఎముకలకు మేలు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.