జామ ఆకుల టీతో ఈ సమస్యలు మాయం..! 8 నుంచి 9 వారాల పాటు తాగితే ఊహించని లాభాలు..

|

Dec 21, 2024 | 8:04 AM

జామ ఆకులను కాస్త చింతపండు, ఉప్పు కలిపి తింటే ఆ రుచే వేరు.. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పాన్‌ తినే ఉంటారు. అయితే, జామ ఆకులు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలియకపోవచ్చు. జామ ఆకులతో తయారు చేసిన టీ క్రమం తప్పకుండా 8 నుంచి 9 వారాల పాటు తాగితే ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జామ కాయలను  తింటే ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తాయో  వాటి ఆకులతో తయారు చేసిన టీ కూడా శరీరానికి అంతే ప్రయోజనం కలిగిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని సంరక్షిస్తాయి. జామ ఆకుల్లో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. దీంతో బీపీ లెవల్స్‌ స్థిరంగా ఉంచుతుంది.

2 / 5
జామ ఆకుల్లో షుగర్‌లో ఉండే సుక్రోజ్, మాల్టోజ్‌ను శోషించుకునే గుణం ఉంటుంది. వీటిల్లో ఉండే ప్రత్యేకమైన ఎంజైములు జీర్ణాశయంలో ఉన్న కార్బొహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మారుస్తాయి. 
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ను తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్న వారు జామ ఆకుల్ని తీసుకుంటే మంచిది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. జామ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

జామ ఆకుల్లో షుగర్‌లో ఉండే సుక్రోజ్, మాల్టోజ్‌ను శోషించుకునే గుణం ఉంటుంది. వీటిల్లో ఉండే ప్రత్యేకమైన ఎంజైములు జీర్ణాశయంలో ఉన్న కార్బొహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మారుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ను తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్న వారు జామ ఆకుల్ని తీసుకుంటే మంచిది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. జామ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

3 / 5
జామ ఆకులతో తయారు చేసిన టీ చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై మచ్చలు పోగొట్టే విటమిన్-సీ అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జామ ఆకుల టీ జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇతర సమస్యలను నయం చేస్తుంది. జామ ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది.

4 / 5
శరీరంలో డయేరియాకు కారణమయ్యే స్టాఫీలోకోక్కస్ ఆరెస్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. డయేరియాతో బాధపడే వారు రెగ్యూలర్ మెడిసిన్‌తో పాటు జామ ఆకుల టీ తాగితే నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి తగ్గుతుంది. జామ ఆకుల్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. అలాగే జామ ఆకుల్ని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మ సమస్యలకి దూరంగా ఉండవచ్చు.

5 / 5
విటమిన్-సీ, ఐరన్ అధికంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు రాకుండా రక్షణ కల్పిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కఫాన్ని కూడా తగ్గిస్తుంది. గొంతు, ఊపిరితిత్తులను శుభ్రం చేసి జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని తొలగించడానికి జామ ఆకుల అద్భుతంగా పనిచేస్తాయి. జామ ఆకులను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి రేటు పెరుగుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్‌ నాణ్యత కూడా బాగుంటుంది.