Barley Water For Diabetes: డయాబెటిస్‌ రోగులు పొద్దున్నే ఖాళీ కడుపుతో బార్లీ నీటిని సేవిస్తే ఏం జరిగేదిదే..!

|

Jul 04, 2024 | 8:34 PM

మధుమేహం నిర్ధారణ అయిన తర్వాత ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తీపి ఆహారాలు తక్షణమే మానుకోవాలి. అంతేకాకుండా జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చేసుకోవాలి. అయితే ప్రతిరోజూ ఈ డ్రింక్‌ తాగితే షుగర్ గురించిన చింతను మానుకోవచ్చు. అదే బార్లీ నీరు..

1 / 5
మధుమేహం నిర్ధారణ అయిన తర్వాత ఆహారంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తీపి ఆహారాలు తక్షణమే మానుకోవాలి. అంతేకాకుండా జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చేసుకోవాలి. అయితే ప్రతిరోజూ ఈ డ్రింక్‌ తాగితే షుగర్ గురించిన చింతను మానుకోవచ్చు. అదే బార్లీ నీరు.

2 / 5
బార్లీలో 'బీటా గ్లూకాన్' అనే తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో అదనపు చక్కెరను శోషించడాన్ని నిరోధిస్తుంది. తీపి పదార్థాలను తినే ధోరణిని కూడా తగ్గిస్తుంది. బార్లీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులలో శారీరక మంటను తగ్గిస్తుంది. అలాగే కీళ్లనొప్పులు, గౌట్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

3 / 5
బార్లీ వాటర్‌లోని ఫైబర్, ఇతర పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బార్లీ నీరు మలబద్ధకం, అపానవాయువు, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిక్ రోగులలో గుండె జబ్బులు చాలా సాధారణం. బార్లీ వాటర్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి. ఈ పానీయంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 5
బార్లీ నీరు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. బార్లీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు నరాల సమస్యలనూ దూరం చేస్తాయి. మధుమేహంలో బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బార్లీ నీరు కూడా దీన్ని చేయగలదు. ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. బార్లీ వాటర్ తాగడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు.

5 / 5
బార్లీని బాగా కడిగి రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, అందులో కొంచెం నీరు కలిపి, స్టౌ మీద 10 నిమిషాలు ఉడికించాలి. అనంతరం బార్లీని వడకట్టాలి. ఈ బార్లీ నీటిలో నిమ్మరసం, పుదీనా ఆకులను కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.