ఓరీ దేవుడో.. పుచ్చకాయపై ఉప్పు వేసుకుని తింటే ఇంత డేంజరా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Mar 18, 2025 | 4:21 PM

ఎండా కాలం వచ్చేసింది. ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి ఉపశమనం కోసం చాలా మంది చల్లటి ఆహారాలు, శీతలపానీయాలను తీసుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎక్కువగా పుచ్చకాయ తింటారు. అయితే, కొందరు పుచ్చకాయపై ఉప్పు వేసుకుని తింటుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా..? అయితే, పుచ్చకాయపై ఉప్పు వేసుకుని తినటం వల్ల లాభామా..? నష్టమా ..? ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి కంటెంట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వల్ల మంచి ప్రకాశవంతమైన, అందమైన రంగుని ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పుచ్చకాయని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

2 / 5

వర్కౌట్ తర్వాత తీసుకుంటే రక్తపోటు తగ్గడమే కాకుండా కండరాల వాపు కూడా తగ్గుతుంది. గుండెజబ్బులు తగ్గుతాయి. బరువుని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే,​కొందరు పుచ్చకాయపై ఉప్పు చల్లి తినడం ఇష్టపడుతుంటారు. ఈ వెరైటీ కాంబినేషన్‌ని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.

3 / 5
వాటర్‌ మిలాన్‌లో ఉప్పు వేసుకుని తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే పుచ్చకాయలోని పోషకాలు తగ్గడమే కాకుండా రక్తపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. బీపీ, హార్ట్‌, కిడ్నీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కీళ్ల నొప్పులు సమస్యలు వస్తాయి. చక్కర కూడా వేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు

4 / 5
అలాగే, మాంసాహారం తిన్నాక కూడా పుచ్చకాయ తినటం మంచిది కాదని చెబుతున్నారు. పుచ్చకాయ తిన్నాక గుడ్డు కూడా తినకూడదు. వాటర్‌ మెలన్‌ తిన్న వెంటనే ఎక్కువ ప్రోటీన్‌ ఉండే మాంసం, చేపలు వంటివి తీసుకోకూడదు. వీటివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

5 / 5
అలాగే, పుచ్చకాయను కట్‌ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల పుచ్చకాయలోని పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే పుచ్చకాయ తిన్నాక పాలు తాగొద్దు. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గ్యాస్‌, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిళ్లు కూడా పుచ్చకాయ తినకూడదని చెబుతున్నారు.