అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే చేస్తారు

Updated on: Oct 18, 2026 | 3:20 PM

పండుగల రోజు ఇంటిల్లిపాదికీ నచ్చే, సులభంగా తయారుచేసుకోగలిగే ప్రసాదాలలో పెసరపప్పు అటుకుల పాయసం చాలా ముఖ్యమైనది. కృష్ణాష్టమి, ఉగాది వంటి ప్రత్యేక దినాలలో దీనిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రెసిపీ చాలా కమ్మగా, రుచిగా ఉంటుందని, ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే పాయసం చేసుకుంటారు. ఈ పాయసం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

కావాల్సిన పదార్థాలు:  పెసరపప్పు: అర కప్పు, అటుకులు: ఒక కప్పు,  బెల్లం: ఒకటింపావు కప్పు (తీపి తగ్గించుకోవాలంటే ఒక కప్పు), నీళ్లు: పెసరపప్పు నానబెట్టడానికి రెండు కప్పులు, బెల్లం కరిగించడానికి పావు కప్పు,  పాలు: మూడు కప్పులు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: అర టీస్పూన్, కొబ్బరి ముక్కలు: కొన్ని (పచ్చి లేదా ఎండు), జీడిపప్పు, బాదం పప్పు: తగినంత తీసుకోవాలి.

2 / 5
ముందుగా, ఒక పాన్‌లో అర కప్పు పెసరపప్పును లో టు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆపి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది.

3 / 5
పప్పు నానే లోపు, బెల్లం సిరప్ తయారుచేసుకోవాలి. ఒక గిన్నెలో ఒకటింపావు కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి, ఒక పొంగు రాగానే స్టవ్ ఆపి, వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేస్తే చిక్కబడకుండా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు అటుకులు వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొద్దిగా పొంగినట్లుగా కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో నానబెట్టిన పెసరపప్పును వేసి, ఒక టీస్పూన్ నెయ్యి కూడా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన పాయసం తినేటప్పుడు పప్పు తగులుతూ రుచికరంగా ఉంటుంది. పప్పు ఉడికే లోపు, మరొక గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాచి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు అటుకులు వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొద్దిగా పొంగినట్లుగా కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నానబెట్టిన పెసరపప్పును వేసి, ఒక టీస్పూన్ నెయ్యి కూడా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన పాయసం తినేటప్పుడు పప్పు తగులుతూ రుచికరంగా ఉంటుంది. పప్పు ఉడికే లోపు, మరొక గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాచి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఉడికించిన పెసరపప్పులో వేయించిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్‌ను లోలో పెట్టి, కాచి పెట్టుకున్న పాలను కూడా పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అటుకులు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఈ పాయసం ఉడికేటప్పుడు పల్చగా అనిపించినా, చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా పల్చగానే చేసుకోవడం మంచిది. అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, యాలకుల పొడి , పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిసిన తర్వాత, తిరిగి స్టవ్ ఆన్ చేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మరొక పక్కన, స్టవ్ పైన చిన్న పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి బాగా కలిపి, వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే, కమ్మని పెసరపప్పు అటుకుల పాయసం రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us