Health Tips: బాణపొట్టకు చెక్‌ పెట్టాలంటే ఈ వాటర్ ట్రై చేయండి.. ఇట్టే కరిగిపోద్ది!

|

Nov 13, 2024 | 2:05 PM

చియా సీడ్స్‌.. ఇప్పుడు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం చాలామంది వీటినే ఆశ్రయిస్తున్నారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండే చియా సీడ్స్‌ క్రమం తప్పకుండా తీసుకుంటే.. చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేయడంతో పాటు చర్మకణాలను పునరుజ్జీవింపజేయడానికి హెల్ప్‌ చేస్తుంది. అయితే,చియా సీడ్స్‌ వాటర్‌తో అల్లం కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
చియావిత్తనాలు విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజూ అల్లంతో పాటు చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

2 / 6
అల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే.. ఎక్కడ మట్టి, ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని కూడా వలుస్తుంటాం. ముఖ్యంగా దీన్ని వంటకు ఉపయోగించే ముందు తొక్క తీసేయడం చాలా మందికి అలవాటు. ఈ పొట్టు అతుక్కొని ఉండడం వల్ల తొలగించడం చాలా చికాకు కలిగించే పని.

3 / 6
రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజూ అల్లంతో పాటు చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి. చియా సీడ్ వాటర్‌ను అల్లం కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చియా విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల స్టోర్‌హౌస్. కాబట్టి వీటిలో నానబెట్టిన నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మంచిది. చియా గింజల్లో కాల్షియం,యు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

4 / 6
అల్లం రసంతో తయారు చేసిన చియా వాటర్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంరసం చియా సీడ్స్‌తో తయారు చేసిన ఈ పానీయం బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అల్లం థర్మోజెనిక్  ప్రభావాలు, చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కేలరీలను కాల్చడంలో సహయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

5 / 6
బ్లడ్‌షుగర్‌ ఉన్నవారికి ఈ డ్రింక్‌ ఎనర్జీటిక్‌గా పనిచేస్తుంది. జింజర్ చియా వాటర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ వాటర్‌ జీర్ణక్రియ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా అల్లంరసం, చియా వాటర్‌ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది. సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

6 / 6
అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని తొక్క, మట్టి ఉంటే తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కపెట్టుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి తగిన మోతాదులో తేనె కలిపితే జింజర్ చియా వాటర్ రెడీ