
చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : అరకేజీ పచ్చి రొయ్యలు, 150 గ్రాములు చింత చిగురు, ఒక ఉల్లిపాయ, మూడు టమాటాలు, రెండు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మసాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ఆకులు, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

ముందుగా పచ్చి రొయ్యలను ఉడికించుకోవాలి : పచ్చి రొయ్యలను తీసుకుని మంచిగా శుభ్రపరిచి, దాని మధ్యలో ఉన్న నల్ల దారాన్ని తీసివేయాలి. ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురును తీసుకుని రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు మెత్తగా కాకుండా గట్టిగా వీటిని ఉడకబెట్టాలి. ఇలా చేస్తే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. పాన్‌లో 1 టీ స్పూన్ నూనె వేసి, అది బాగా వేడయ్యాక దానిలో రొయ్యలు వేసి 15 నిమిషాల పాటు వేయించాలి. అలా ఉడికించకండి లేదంటే అవి గట్టిగా అవుతాయి. మరి మెత్తగా కాకుండా లైట్‌గా వేపి ఒక దానిలో గిన్నె లేదా ప్లేట్ లో పెట్టుకోవాలి.

మీడియం సైజ్ పాన్ తీసుకుని ఆయిల్ వేసి అది వేడయ్యాక నాలుగు కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బంగారు కలర్లోకి మారే వరకు వేయించాలి. ఒక టీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దీన్ని బాగా వేయించాలి.

ఇప్పుడు ఈ మసాలాలో కొద్దిగా చింత చిగురు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటిని బాగా కలపాలి. చింత చిగురు బాగా ఉడికే వరకు మూతపెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. వీటిని మసాలా కలుపుకోవాలి. చివర్లో రొయ్యలు, చింతపండు కూడా రసం వేసి మీడియం మీడియం మంట పై 10 నిమిషాల పాటు ఉంచాలి.