Green Pea Salad: సన్నజాజి తీగలా మారాలా? ఐతే పచ్చి బఠానీ సలాడ్‌ ట్రై చేయండి..

Updated on: Dec 18, 2025 | 12:29 PM

శీతాకాలం సీజనల్ పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జాబితాలో పచ్చి బఠానీ కూడా ఉంది. రుచికరమైన పచ్చి బఠానీ ఈ కాలంలో మాత్రమే దండిగా లభిస్తాయి. చాలా మంది మార్కెట్ నుంచి తాజా బఠానీలను తెచ్చి కొన్ని నెలల పాటు ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంటారు. తద్వారా అవి అవసరమైనప్పుడల్లా..

1 / 5
శీతాకాలం సీజనల్ పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జాబితాలో పచ్చి బఠానీ కూడా ఉంది. రుచికరమైన పచ్చి బఠానీ ఈ కాలంలో మాత్రమే దండిగా లభిస్తాయి. చాలా మంది మార్కెట్ నుంచి తాజా బఠానీలను తెచ్చి కొన్ని నెలల పాటు ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంటారు. తద్వారా అవి అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.

2 / 5
శీతాకాలంలో బఠానీలు పెద్ద మొత్తంలో పండిస్తారు. బఠానీలు రుచికరమైనవి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

3 / 5
వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా, ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సరైన ఆహారం ఇది. కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. మాంసాహారం తినని వారు ప్రొటీన్‌ కోసం పచ్చి బఠాణీలను ఎంచుకోవచ్చు.

4 / 5
మీ రోజువారీ ఆహారంలో బఠానీలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి పచ్చి బఠానీ ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
ఇందులో విటమిన్ ఎ, సి, కె, బి-కాంప్లెక్స్ వంటి విటమిన్లు, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సలాడ్‌లలో పచ్చి బఠానీ చేర్చుకోవడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. బఠానీలను కొద్దిగా వేయించి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పనీర్‌తో కలిపి సలాడ్‌ తయారు చేసుకోవచ్చు.