
శకున శాస్త్రంలో ఇంట్లో జీవులు కనిపించడం గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది. అదే విధంగా ఇంటిలోపల జర్రీ ఉండటంపై కూడా కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. చాలా మంది ఇది ఒక పురుగు అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రంలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నదంట. దీని కదలికలు, ఇది కనిపించడం, అనేక మార్పులను సూచిస్తుందంట.

కొన్ని సందర్భాల్లో ఇంటిలో జర్రీ కనిపిస్తుంటుంది. అయితే ఇది శుభ, అశుభ ఫలితాలను ఇస్తుందంట. ముఖ్యంగా జర్రీ రాహు గ్రహానికి సంబంధించినది, అందువలన దీని ప్రభావం ఇంటిపై ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఎవరి ఇంటిలోనైతే జర్రీ బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తుందో, ఇది చాలా మంచిది, శుభ సూచకం.

ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారి ఇంటిలో జర్రీ కనిపించి, అది బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తే, వారి బాధలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతున్నట్లేనంట. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడం, ఆర్థికపరమైన పనులు పూర్తి అవ్వడం జరుగుతుందంట. అందుకే ఇలా కనిపించడం శుభ సూచకం.

ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద జర్రీ బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తే , ఇంటిలో ఉన్న ప్రతి కూల శక్తి బయటకు పోతున్నట్లే అంటున్నారు నిపుణులు. ఇక వంట గది లేదా హాల్‌లో జర్రీ కనిపించడం అస్సలే మంచిది కాదంట, ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారు పండితులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు