మీ ఇంట్లో ఇవి ఉంటే దోమలకు చుక్కలే.. అటు వైపు చూడాలన్నా భయపడతాయ్..

Updated on: Mar 13, 2026 | 5:55 PM

వేసవిలో ఎండలతో పాటు దోమల భయం కూడా మొదలవుతుంది. సాయంత్రం కావడమే ఆలస్యం.. బాల్కనీలు, కిటికీల గుండా ఇంట్లోకి చొరబడే ఈ కీటకాలు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరినీ ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. వీటి కాటు వల్ల జబ్బులు రావడమే కాకుండా మన ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. అయితే, రసాయనాలతో కూడిన కాయిల్స్ వాడకుండా కొన్ని రకాల మొక్కలను నాటడం ద్వారా దోమలను సమర్థవంతంగా తరిమికొట్టవచ్చు.

1 / 5
లావెండర్: లావెండర్ అంటే మనకు సువాసన.. కానీ దోమలకు మాత్రం అది పీడకల. ఈ మొక్క నుండి వచ్చే ఘాటైన వాసనను దోమలు అస్సలు భరించలేవు. దోమలే కాకుండా ఇతర హానికర కీటకాలు కూడా ఈ మొక్క దగ్గరకు రావు. మీ కిటికీల దగ్గర ఈ మొక్కను ఉంచితే దోమలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

2 / 5
బంతి పూల మొక్క: చూడటానికి అందంగా ఉండే ఈ పూల మొక్కలో పైరెథ్రమ్ అనే సమ్మేళనం ఉంటుంది. మార్కెట్‌లో దొరికే దోమల వికర్షక ఉత్పత్తుల్లో కూడా దీనినే వాడుతుంటారు. ఈ పూల వాసన చూస్తే చాలు దోమలు పారిపోతాయి. వీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా కిటికీల వద్ద కుండీల్లో నాటుకోవచ్చు.

3 / 5
నిమ్మగడ్డి: నిమ్మగడ్డిలో సిట్రోనెల్లా అనే సహజ సిద్ధమైన నూనె ఉంటుంది. ఈ మొక్క వెదజల్లే సువాసన దోమలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అంతేకాదు ఈ ఆకులను నేరుగా చర్మంపై రుద్దుకుంటే దోమలు అస్సలు కుట్టవు. ఇది ఒక అద్భుతమైన నేచురల్ రిపెల్లెంట్‌లా పనిచేస్తుంది.

4 / 5
పుదీనా: మనం బిర్యానీలో వేసుకునే పుదీనా దోమలకు బద్ధ శత్రువు. దోమలు పుదీనా మొక్కలకు చాలా దూరంగా ఉంటాయి. దీని ఘాటైన వాసన వల్ల దోమలు మాత్రమే కాదు, ఇతర చిన్న చిన్న పురుగులు కూడా ఇంటి దరిదాపుల్లోకి రావు.

5 / 5
రోజ్ మేరీ: ఈ మొక్క కూడా దోమలను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇంట్లో ఒక మంచి సువాసనతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దోమలు, ఈగలు లేని ప్రశాంతమైన ఇల్లు మీ సొంతమవుతుంది.

Follow Us