“స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాలా?”

కరోనాతో కలిసి జీవించక‌ తప్పదని చెబుతున్న ఏపీ స‌ర్కార్… స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయవలసిందేనని సంకేతాలు పంపుతుంద‌ని పవన్ కల్యాణ్ విమర్శించారు. పరిహారం ఇచ్చారు…స‌రే మరి పరిష్కారం ఎప్పుడు చూపుతున్నార‌ని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పర్యావరణం హానిక‌లిగించ‌కుండా, జనజీవన అనుకూలంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి… పర్యావరణహితంగానూ, ప్రజల జీవన విధానాలు మెరుగుప‌డ‌టానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని వెల్ల‌డించారు. విశాఖ విష‌వాయువు లీకు ప్రమాదానికి కారణమైన మేనేజ్మెంట్ పై నమోదు చేసిన […]

స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాలా?
Follow us

|

Updated on: May 17, 2020 | 10:43 PM

కరోనాతో కలిసి జీవించక‌ తప్పదని చెబుతున్న ఏపీ స‌ర్కార్… స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయవలసిందేనని సంకేతాలు పంపుతుంద‌ని పవన్ కల్యాణ్ విమర్శించారు. పరిహారం ఇచ్చారు…స‌రే మరి పరిష్కారం ఎప్పుడు చూపుతున్నార‌ని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

పర్యావరణం హానిక‌లిగించ‌కుండా, జనజీవన అనుకూలంగా ఉండే పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి… పర్యావరణహితంగానూ, ప్రజల జీవన విధానాలు మెరుగుప‌డ‌టానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని వెల్ల‌డించారు. విశాఖ విష‌వాయువు లీకు ప్రమాదానికి కారణమైన మేనేజ్మెంట్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం ఆశ్య‌ర్య‌ప‌డుతున్నార‌ని పవన్ వ్యాఖ్యానించారు. కేపు దర్యాప్తు ముందుకు క‌ద‌ల‌డం లేద‌న్న ప‌వ‌న్… స్టైరీన్ గ్యాస్ పీల్చినవారు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు.