మౌలానా సాద్ కు తప్పని ట్రబుల్స్.. ఐదుగురు సహచరుల పాస్ పోర్టులు సీజ్

దేశంలో కరోనా వైరస్ కేసులు  ప్రబలడానికి కారణమని భావిస్తున్న తబ్లీఘీ జమాత్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ  సంస్థ చీఫ్ మౌలానా సాద్ కందాల్వీ కి అత్యంత సన్నిహితులైన ఐదుగురి పాస్ పోర్టులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముప్తీ షహజాద్, జీషాన్, ముర్సాలిన్ సైఫీ, మహమ్మద్ సల్మాన్, యూనస్ అనే ఈ ఐదుగురూ దేశం వదిలి వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. వీరంతా సాద్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆయనకు ‘చాలా’ సహకరించేవారట.. ముఖ్యంగా […]

మౌలానా సాద్ కు తప్పని ట్రబుల్స్.. ఐదుగురు సహచరుల పాస్ పోర్టులు సీజ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 5:41 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు  ప్రబలడానికి కారణమని భావిస్తున్న తబ్లీఘీ జమాత్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ  సంస్థ చీఫ్ మౌలానా సాద్ కందాల్వీ కి అత్యంత సన్నిహితులైన ఐదుగురి పాస్ పోర్టులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముప్తీ షహజాద్, జీషాన్, ముర్సాలిన్ సైఫీ, మహమ్మద్ సల్మాన్, యూనస్ అనే ఈ ఐదుగురూ దేశం వదిలి వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. వీరంతా సాద్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆయనకు ‘చాలా’ సహకరించేవారట.. ముఖ్యంగా మర్కజ్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవారట. దీంతో పోలీసులు వీరిపై  ప్రత్యేకంగా నజర్ పెట్టారు.

ఇక జమాత్ లో సభ్యులుగా ఉన్న విదేశీయుల మీద కూడా ఖాకీలు ఉచ్ఛు బిగిస్తున్నారు. త్వరలో ఇలాంటి 916 మందిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఈ విదేశీ జమాత్ సభ్యులంతా ఇదివరకే వీసా రూల్స్ ని అతిక్రమించారని, వారి పాస్ పోర్టులను, ఇతర డాక్యుమెంట్లను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 67 దేశాలకు చెందిన వీరంతా టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చారని, కానీ ‘టూరిస్టు టూర్లకు’ పోకుండా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారని తెలిసింది. వీరిలో ముగ్గురిని ఖాకీలు ఇదివరకే ఇంటరాగేట్ చేశారు. మౌలానా సలహా పైనే తాము మార్చి 20 తరువాత కూడా మర్కజ్ లో ఉన్నామని వీరు చెప్పినట్టు వెల్లడైంది.