గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్ సంస్థ.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు రూ. 1000 ఉండొచ్చట.!

2021 ఫిబ్రవరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్‌ను మొదటిగా హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి అందిస్తామని.. ఆ తర్వాత ఏప్రిల్‌కు సామాన్య ప్రజలకు...

  • Ravi Kiran
  • Publish Date - 12:53 pm, Fri, 20 November 20
గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్ సంస్థ.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు రూ. 1000 ఉండొచ్చట.!

Oxford Vaccine: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భారత్‌లో ‘కోవిషీల్డ్’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన చివరి దశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. ఇక తాజాగా ఆ వ్యాక్సిన్‌పై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా గుడ్ న్యూస్ అందించారు.

2021 ఫిబ్రవరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్‌ను మొదటిగా హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి అందిస్తామని.. ఆ తర్వాత ఏప్రిల్‌కు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అదర్ పూనావాలా వెల్లడించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ ధరపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు రూ. 1000 ఉండొచ్చునని పూనావాలా స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సిద్దం చేశామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు.. నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించిన వెంటనే 2021 జనవరి లోపే వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అదర్ పూనావాలా స్పష్టం చేశారు.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..