సీఏఏ కేవలం వారికోసమే.. క్లారిటీ ఇచ్చిన రాంమాధవ్..

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోలేని ముర్ఖులు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. శరణార్ధుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మతరాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నారన్నారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారన్నారు.భారత […]

సీఏఏ కేవలం వారికోసమే.. క్లారిటీ ఇచ్చిన రాంమాధవ్..
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 1:15 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోలేని ముర్ఖులు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. శరణార్ధుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మతరాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సవరణ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నారన్నారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారన్నారు.భారత దేశంలో నివసిస్తున్న.. ఇక్కడే పౌరులుగా ఉన్న వారికి సంబంధించిన బిల్లు కాదని స్పష్టం చేశారు. పోరుగు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలు.. దశాబ్దాల కాలంగా స్థిరపడ్డవారి కోసం తెచ్చినదే ఈ చట్టమని వివరించారు. అంతేకాదు.. ఇది శరణార్ధులకు ఇది ఆప్షన్ వంటిదని.. వారికి ఇష్టం ఉంటే.. పౌరసత్వం తీసుకొవచ్చని.. లేని పక్షంలో శరణార్ధులుగా ఉండిపోవచ్చని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మత పరంగా చూస్తూ రాజకీయ స్వలాభాల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Latest Articles