నెలరోజుల ఆడ బిడ్డను అమ్మేసి అప్పులు తీర్చేసిన అమ్మమ్మ

ఆడపిల్ల ఇంకా అంగట్లో సరుకుగానే మిగిలిపోతోంది. తల్లి ఒళ్లో సెదతీరాల్సిన పసిబిడ్డ బజార్‌లో వస్తువుగా మారిపోతోంది. ఆడబిడ్డ పుట్టగానే ఆర్థికభారం అనుకునే రక్త సంబంధీకులే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటననే కరీంనగర్ జిల్లా లో చోటుచేసుకుంది. నెలరోజుల పసిపాప అమ్మకం కలకలం రేపుతోంది.

నెలరోజుల ఆడ బిడ్డను అమ్మేసి అప్పులు తీర్చేసిన అమ్మమ్మ
Follow us

|

Updated on: Aug 28, 2020 | 6:15 PM

ఆడపిల్ల ఇంకా అంగట్లో సరుకుగానే మిగిలిపోతోంది. తల్లి ఒళ్లో సెదతీరాల్సిన పసిబిడ్డ బజార్‌లో వస్తువుగా మారిపోతోంది. ఆడబిడ్డ పుట్టగానే ఆర్థికభారం అనుకునే రక్త సంబంధీకులే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటననే కరీంనగర్ జిల్లా లో చోటుచేసుకుంది. నెలరోజుల పసిపాప అమ్మకం కలకలం రేపుతోంది.

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో ఈ దారుణం జ‌రిగింది. నెల రోజుల‌ ప‌సిపాప‌ను ఆ పాప‌ అమ్మమ్మ క‌న‌క‌మ్మ అనే వృద్ధురాలు రూ.1లక్షా 10వేలకు అమ్మేసింది. ఈ విష‌యాన్ని వృద్ధురాలి భ‌ర్తే డయల్‌ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో విష‌యం వెలుగులోకి వచ్చింది. వీణవంక మండల కేంద్రానికి చెందిన క‌న‌క‌మ్మ కూతురు ప‌ద్మ‌కు ర‌మేష్ అనే వ్య‌క్తితో రెండ‌వ వివాహం జ‌రిగింది. ఆ దంపతులు హైదరాబాద్‌లో నివాస‌ముంటున్నారు. నెల‌రోజుల క్రితం వీణ‌వంక‌లో పద్మ ఓ ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. పుట్టిన కూతురును తన తల్లి వద్దే వదిలేసి పద్మ తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోయింది. గతంలో మొదటి వివాహం ద్వారా పద్మ కు ఇద్దరు సంతానం ఉన్నారు. వీరంతా కనకమ్మ వద్దే ఉంటున్నారు.

అయితే, కనకమ్మ కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసింది. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగటంతో డబ్బులకు ఆశపడ్డ కనకమ్మ పసిబిడ్డను అమ్మాలనుకుంది. దీంతో ఆ నెల ఆ పసికందును నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులకు చెందిన రేవెల్లి సంపత్‌ దంపతులకు రూ.1లక్షా 10వేలకు కనకమ్మ అమ్మివేసింది. వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చింది. పసిపాపను విక్రయించడాన్ని కనకమ్మ భర్త యాదగిరి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులను నుంచి పూర్తి వివ‌రాలు తెలుసుకొని చిన్నారిని స్వాధీనం చేసుకొని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. క‌నకమ్మను, ఆమెకు సహకరించిన మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.