Viral Video: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది.. వైరలవుతున్న వీడియో..

ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తూ మార్గ మధ్యంలోనే డెలివరీ అయిన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఒక్కోసారి అనుకోకుండా...

Viral Video: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది.. వైరలవుతున్న వీడియో..
Birth

Updated on: Oct 19, 2021 | 6:35 AM

ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తూ మార్గం మధ్యలోనే డెలివరీ అయిన సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఒక్కోసారి అనుకోకుండా సమయం కాకముందే ప్రసవం జరిగిపోతుంటుంది. అలా సరదాగా భర్తతో కలిసి బయటకు వెళ్లిన ఓ మహిళకు అనుకోకుండా డెలివరీ అయిపోయింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు.

అయితే అనుకోకుండా కైట్లిన్‌ టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. సమీపంలో ఎలాంటి పబ్లిక్‌ టాయిలెట్స్‌ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌లోని బాత్‌రూంలోకి వెళ్లింది. అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో తోచలేదు.

అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తల్లి బిడ్డలు సురక్షితంగానే ఉన్నారని వైద్యులు చెప్పడంతో దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అనుకోకుండా జరిగే ఇలాంటి సంఘటనలు భయం కలిగిస్తాయి కదా.. అందుకే గర్భిణిలు బయటకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us