Holi 2021: విభిన్న సంస్కృతులు, భాషలు, జాతులు, మతాలు కలిగినది భారతదేశం. మార్చి 29వ తేదీన జరుపుకోనున్న హోళీ పండుగ కూడా రకరకాల రంగులతోనే నిర్వహించుకుంటారు. ఈ రంగుల పండుగ హోలిని దేశ వ్యాప్తంగా వివిధ సంస్కృతుల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా జరుపుకునే ఈ హోళీ సంబరాలను భారతదేశం అంతటా ఎన్ని రకాలుగా జరుపుకుంటారు, ఏఏ పేర్లతో పిలుస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫకువా / ఫగువా
అస్సామీ ప్రజలు హోలీని ఫకువా మరియు డౌల్‌గా రెండు రోజులు ఈ వేడుకలను జరుపుకుంటారు. రాక్షసి హోలిక సంహారానికి ప్రతీకగా మట్టి గుడిసెలను తగులబెడతారు. మరుసటి రోజు రంగులతో హోలీ అడుతారు. ఈ ఫగువా వేడుకలను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు.
ఉక్కులి
గోవా ప్రజలు హోలీని ఉక్కులి అని పిలుస్తారు. వసంత పండుగ షిగ్మోలో భాగంగా ఈ హోలీని జరుపుకుంటారు. ఈ వేడుకలను మొత్తం నెల రోజుల పాటు చేసుకుంటారు. అంతేకాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
ధూలేటి
అహ్మదాబాద్‌లోని యువకులు ఒకరి భుజాలపై ఎక్కి నేలమీద ఎత్తులో వేలాడుతున్న మజ్జిగ కుండను పగలగొడతారు. చిన్న కృష్ణుడు వేర్వేరు గృహాల నుండి వెన్నను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నగా పురాతన సన్నివేశాలను నిర్వహిస్తారు. అలా హోలీ సంబరాలను చేసుకుంటారు.
లాథ్మార్ హోలీ..
లాథ్మార్ అనే పదానికి “కర్రలతో కొట్టడం” అని అర్ధం. ఉత్తర ప్రదేశ్ మహిళలు పురుషులను సరదాగా కొట్టడానికి కర్రలను ఉపయోగిస్తారు. దేవి రాధాతో శ్రీకృష్ణుడు హోలీ ఆడేందుకు ఆమె గ్రామమైన బర్సానాకు వస్తారు. అయితే, దేవి రాధా గ్రామస్తులైన స్త్రీలు శ్రీకృష్ణుడిని వెంబడిస్తారు. దాని ఆధారంగా లాత్మార్ హోలీని యూపీలో జరుపుకుంటారు.
బేదర వేషా
ఇది ప్రత్యేకమైన హోలీ పండుగ. కర్ణాటక రాష్ట్రంలో హోలీ సందర్భంగా ఐదు రోజుల పాటు జానపద కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలు సంవత్సరం విడిచి సంవత్సరం నిర్వహిస్తారు.
హోల్లా మొహల్లా
పంజాబ్ రాష్ట్రంలో నిహాంగ్ సిక్కులకు యుద్ధ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ.. ఈ పండుగను సిక్కులు మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిని 10 వ సిక్కు మత నాయకుడు గురు గోవింద్ సింగ్ ప్రారంభించారు.
డోల్ జాత్రా
వసంత పండుగైన బసంత ఉత్సవంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు హోలీని జరుపుకుంటారు. డోల్ జాత్రా పేరుతో జరుపుకునే ఈ వేడుకలో భాగంగా ప్రజలు రాధాకృష్ణుల విగ్రహాలను పల్లికలి పట్టణాలు, గ్రామాల్లో ఊరేగిస్తారు.
యోసాంగ్
మణిపూర్ స్థానికులు తమ దేవుడైన పఖంగ్బాను గుర్తు చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తరువాత గుడిసెలను తగలబెడతారు. పిల్లల చేత విరాళాలు సేకరిస్తారు. ఈ వేడుకలో భాగంగా యోసాంగ్ అనే ఐదు రోజుల క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Also read: