Viral Video: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా వచ్చిన భారీ పాము.. ఆ యువతి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..

|

Jun 14, 2021 | 6:45 PM

Viral Video: సాధారణ పాములు కనిపిస్తేనే చాలా మంది హడలిపోతారు. అది అంత దూరంలో ఉంటే.. ఇక్కడి నుంచి ఇటే పారిపోతారు. ఇంకొందరు...

Viral Video: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా వచ్చిన భారీ పాము.. ఆ యువతి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..
Kobra
Follow us on

Viral Video: సాధారణ పాములు కనిపిస్తేనే చాలా మంది హడలిపోతారు. అది అంత దూరంలో ఉంటే.. ఇక్కడి నుంచి ఇటే పారిపోతారు. ఇంకొందరు కొంచెం ధైర్యంగానే ఉంటారు. అయితే, పామును పట్టుకునేందుకు మాత్రం సాహసించరు. ఇక ఆడవాళ్ల విషయాన్ని పరిశీలిస్తే.. బొద్దింకలను చూసే జడుసుకుంటారు అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది. అయితే, ఓ యువతి ఆ ఫీలింగ్ తప్పు అని నిరూపించింది. అలాంటి భారీగా ఉన్న కోబ్రాను ఒంటి చేత్తో పట్టేసింది. అలా పాముని పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది. ఆ యువతి పామును పట్టుకున్న వీడియోను నాగేశ్వరి పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్‌ ఐడీలో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయడం ఆలస్యం.. నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు.

అసలు అక్కడ ఏం జరిగిందంటే.. ఓ ఇంటి నిర్మాణ సంస్థలంలో ఉన్న నాప రాళ్ల కింద పాము కనిపించింది. అది చూసి పలువురు భయపడ్డారు. అయితే ఓ యువతి మాత్రం ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా అడుగు ముందుకేసి బండరాళ్ల కింద నక్కిన పామును తోక పట్టుకుని బయటకు లాగింది. అలా పామును ఒంటి చేత్తో బయటకు పట్టుకొచ్చింది. అనంతరం ఆ పామును ఇంటికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది. అయితే, యువతి పామును పడుతుండగా అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను ‘నాగేశ్వరి ది స్నేక్ లవర్’ అని క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయడం ఆలస్యం.. ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Shocking Video: ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలును పట్టుకునేందుకు ప్రయత్నించాడు.. ఆ తర్వాత మీరు అనుకున్నట్లుగా జరగలేదు..