ఒరిస్సా మళ్లీ పట్నాయక్​దే

లోక్​సభ ఎన్నికలతో పాటు ఒడిశా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజూ జనతా దళ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఐదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు నవీన్ పట్నాయక్. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న భాజపా రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది. ఒడిశాలో 19 ఏళ్లుగా బిజూ జనతాదళ్​దే ఏకచ్ఛత్రాధిపత్యం. తొలిసారి 2000 సంవత్సరంలో పాలన పగ్గాలు చేపట్టారు నవీన్​ పట్నాయక్. ఆ తర్వాత తిరుగులేదు. […]

ఒరిస్సా మళ్లీ పట్నాయక్​దే
Follow us

|

Updated on: May 23, 2019 | 12:26 PM

లోక్​సభ ఎన్నికలతో పాటు ఒడిశా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజూ జనతా దళ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఐదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు నవీన్ పట్నాయక్. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న భాజపా రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది.

ఒడిశాలో 19 ఏళ్లుగా బిజూ జనతాదళ్​దే ఏకచ్ఛత్రాధిపత్యం. తొలిసారి 2000 సంవత్సరంలో పాలన పగ్గాలు చేపట్టారు నవీన్​ పట్నాయక్. ఆ తర్వాత తిరుగులేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ గెలిచారు. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలు రచించారు పట్నాయక్. జనాకర్షక మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తామన్న ప్రకటనతో ఆ వర్గం ఓట్లపై గురిపెట్టి విజయం సాధించారు.

ఒడిశాలో పాగా వేయడంపై బీజేపీ ఎప్పటినుంచో కసరత్తు చేసింది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల్ని తమ వైపునకు తిప్పుకుంది. వీలు చిక్కినప్పుడుల్లా ప్రధాని నరేంద్రమోదీతో ప్రచార సభలు నిర్వహించి… పదేపదే అభివృద్ధి మంత్రం జపించింది. అయినప్పటికీ నవీన్ పట్నాయక్​ను ఢీ కొట్టలేకపోయింది.