శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అనుబంధ ఆలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో అమావాస్య రోజున కొంతమంది తమిళులు క్షుద్రపూజలు నిర్వహించడం సంచలనంగా మారింది.  ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు తమిళనాడు వాసులను అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముక్కంటి ఆలయ ఈవో ధనపాల్‌ చెబితేనే క్షుద్రపూజలు నిర్వహించామని వారు తెలిపారు. […]

శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2019 | 2:44 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అనుబంధ ఆలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో అమావాస్య రోజున కొంతమంది తమిళులు క్షుద్రపూజలు నిర్వహించడం సంచలనంగా మారింది.  ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు తమిళనాడు వాసులను అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముక్కంటి ఆలయ ఈవో ధనపాల్‌ చెబితేనే క్షుద్రపూజలు నిర్వహించామని వారు తెలిపారు. భైరవకోన ఆలయంలో నిక్షిప్తమైన నిధుల కోసమే క్షుద్రపూజలు నిర్వహించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఆలయ ఈవో ధన్‌పాల్‌ను విచారిస్తే నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.  కాగా, పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.