‘సుశాంత్‌ది ఆత్మహత్యే’.. సీబీఐకి ఎయిమ్స్ రిపోర్ట్..

Sushant Singh Rajput AIIMS Forensic report: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును నెపోటిజం నుంచి డ్రగ్స్ వరకు సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యేనంటూ ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పారు. ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ చనిపోయాడని.. అతడి బాడీలో ఎలాంటి విష పదార్ధాలు గుర్తించలేదని ఎయిమ్స్ స్పెషల్ టీమ్ ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. ఈ విషయాన్ని […]

'సుశాంత్‌ది ఆత్మహత్యే'.. సీబీఐకి ఎయిమ్స్ రిపోర్ట్..
Follow us

|

Updated on: Sep 29, 2020 | 1:14 PM

Sushant Singh Rajput AIIMS Forensic report: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును నెపోటిజం నుంచి డ్రగ్స్ వరకు సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యేనంటూ ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పారు. ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ చనిపోయాడని.. అతడి బాడీలో ఎలాంటి విష పదార్ధాలు గుర్తించలేదని ఎయిమ్స్ స్పెషల్ టీమ్ ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది.

సుశాంత్‌ది ఆత్మహత్యా.? లేక హత్యా.? హత్యే అయితే అసలు ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? ఆత్మహత్య అయితే దానికి ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటి.? అనే విషయాలను తేల్చేందుకు సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుశాంత్ డెడ్ బాడీకి కూపర్ హాస్పిటల్‌లో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనితో సీబీఐ ఈ కేసులో తమకు సహకరించాలంటూ ఎయిమ్స్ వైద్యులను కోరింది. సీబీఐ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ స్పెషల్ టీమ్.. సుశాంత్ ఇంటిని పరిశీలించి పారదర్శకంగా రిపోర్టును సిద్ధం చేసింది.

కాగా, సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ కూడా రంగంలోకి దిగి పలువురిని విచారిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. మరోవైపు రియా చక్రవర్తి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా త్వరలోనే సుశాంత్ కుటుంబసభ్యులను సీబీఐ విచారించనుంది. సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసింది అతడి సోదరి అని.. తప్పుడు ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్ ఇచ్చారంటూ రియా ఆరోపిస్తోంది.

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!

Latest Articles